సంఘ నిబంధన

దేవుని కృప ద్వారా మారుమనస్సు పొందుకొని ప్రభువైన యేసు క్రీస్తును విశ్వసించి, తండ్రీ కుమార మరియు పరిశుద్దాత్ముని నామములో బాప్తిస్మము పొందుకొని, మేము ఒకరితో ఒకరము మా నిబంధనను నిర్ధారిస్తున్నాము. (ఎఫెసీయులకు 2:8; మత్తయి 28:19)

1. మేము మా సంఘములో ఐక్యత కొరకు కృషి చేస్తాము మరియు ప్రార్థిస్తాము.
(రోమీయులకు 12:4-5; ఎఫెసీయులకు 4:3-6; ఫిలిపీయులకు 2:2)

2. ఒకరినొకరు కట్టడం ద్వార మరియు ఒకని భారముల నొకడు భరించడం ద్వారా మేము ఒకరిపట్ల ఒకరం ప్రేమకలిగియుంటాము.
(హెబ్రీయులకు 13:1-3; అపొస్తలుల కార్యములు 2:42, 38; 1 కొరింథీయులకు 11:26; మత్తయి 18:17)

3. మేము వినయంగా మరియు సున్నితంగా ఒకరినొకరు భరించి, క్షమించుకుంటాము.
(ఎఫెసీయులకు 4: 2; కొలొస్సయులకు 3: 12-13; మత్తయి 18: 15-20; లూకా 17: 3-4)

4. సువార్త ప్రకటించడాన్ని వినడానికి, ఒకరితో ఒకరు సహవాసం చేసుకోవడానికి, ఒకరికొరకు ఒకరము ప్రార్థన చేయడానికి మరియు సంఘ శాసనాలలో (బాప్తీస్మము మరియు ప్రభువు బల్లలో) పాల్గొనడానికి మేము క్రమం తప్పకుండా సహవాసముకై కలుస్తాము.
(హెబ్రీయులకు 10:25; అపొస్తలుల కార్యములు 2:42; 2:38; 1 కొరింథీయులకు 11:26; మత్తయి 18:17)

5. లోకాన్ని, శరీరాన్ని, మరియు సైతానును తిరస్కరిస్తూ పవిత్రతను అనుసరిస్తూ మేము సువార్త కేంద్రీకృతమైన జీవితాన్ని జీవిస్తాము.
(2 కొరింథీయులకు 5:15; హెబ్రీయులకు 12:14; ఎఫెసీయులకు 2: 1-3; 1 యోహాను 2: 13-17)

6. మేము క్రమం తప్పకుండా ఒకరికొకరు సువార్తను జ్ఞాపకము చేసుకొంటూ మరియు సువార్తను ఇతరులకు మా మాటలతో మరియు పనుల ద్వారా ప్రకటిస్తాము.
(అపొస్తలుల కార్యములు 20: 20-21; 1 కొరింథీయులకు 2: 1-2; మత్తయి 28: 18-20; మత్తయి 5: 13-16)

7. సువార్త పని కోసం మేము క్రమం తప్పకుండా, ధారాళముగా మరియు ఆనందంగా ఇస్తాము.
(2 కొరింథీయులకు 9: 7; 1 తిమోతి 5: 17)

8. మేము ఈ సంఘము నుండి వెళ్ళిపోయినప్పుడు వాక్యానుసారమైన సువార్తను బోధించే మరొక సంఘములో సభ్యత్వం కోరుకుంటాము.
(రోమీయులకు 16:1-2)

ప్రభువైన యేసు క్రీస్తు యొక్క కృప, తండ్రియైన దేవుని ప్రేమ,పరిశుద్ధాత్ముని సహవాసము మనందరికి తోడైయుండునుగాక. ఆమెన్.
(2 కొరింథీయులకు 13:14)

Church Covenant

By the grace of God, having repented and believed in our Lord Jesus Christ (Ephesians 2:8), and having been baptized in the name of the Father, Son, and Holy Spirit (Matthew 28: 19), we affirm our covenant with one another.

1. We will work and pray for the unity in our church (Romans 12:4-8; Ephesians 4:3-6; Philippians 2:2).

2. We will love one another by building (investing in) one another (Hebrews 13:1-3; 1 Thessalonians 5:11,14), and by bearing one another’s burdens (Romans 12:9-16; Galatians 6:2).

3. We will humbly and gently bear with one another (Ephesians 4:2; Colossians 3:12-13) and forgive one another (Matthew 18:15-20) (Luke 17:3-4).

4. We will regularly gather together (Hebrews 10:25; Acts 2:42) to hear the Godpel proclaimed, to fellowship with one another, to pray for one another, and to participate in the Church Ordinances (Baptism and Lord’s Supper) (Acts 2:38; 1 Cor 11:26′ Matt 18:17).

5. We will live a Gospel centered life (2 Corinthians 5:15) as we pursue holiness (Hebrews 12:14) while denying the world, the flesh, and the devil (Ephesians 2:1-3; 1 John 2:13-17).

6. We will seek to regularly remind one another of the Gospel (Acts 20:20-21; 1 Corinthians 2:1-2), and to proclaim the Gospel to others (Matthew 28:18-20) in word and deed (Matthew 5: 13-16).

7. We will give regularly, generously and cheerfully (2 Cor 9:7) for the cause of the gospel (1 Timothy 5:17).

8. We will seek membership in another Gospel preaching church when we move away from this church (Romans 16:1-2).

May the grace of the Lord Jesus Christ, and the love of GOd the Father, and the fellowship of the Holy Spirit be with us all. Amen (2 Cor 13:14).