మీకొరకు ఈ శుభవార్త

దేవుడిని వెధకి వెధకి ఆయన దొరకనందున అలసిపోయారా? దేవున్ని ఆనంద పరచటానికి మీరు సాధ్యమైనంత మంచి పనులు చేసికూడా అతడు మిమ్మల్ని అంగీకరించడని భావిస్తున్నారా? ఐతే శుభవార్త ఏమిటంటే మీరవ్వనీ చేయనవసరెంలేదు. కాని అది పూర్తి శుభవార్త కాదు. మిగితా శుభవార్త తెలుసుకొనక ముందు కొన్ని విశయాలు మీరు తెలుసుకోవాళ్ళి. అసళు మనము దేవున్ని ఎందుకు వెధుకుతున్నాము, అతన్ని ఎందుకు ఆనందపరచటానికి ప్రయత్నిస్తునామో ముందు తెలుసుకోవాళ్ళి.

మన హృదయలోత్తుళ్ళో మనకు తెలుసు మనము దేవునినుండి దూరముగా ఉన్నామని, దేవుని ముందు నీతిమంతులుగా లేమని మరియు దేవుడు మన పట్ల సంతోషముగా లేడని. మనము పరిపూర్ణముగా లేము గనుక మరియు అతని ముందు నీతిమంతులుగా జీవించే విధానములో విఫలమవుతూ ఉంటాము గనుక దేవుడు మన పట్ల కోపముగా ఉన్నాడని మనకు తెలుసు. అది నిజం మరియు దేవుడుకూడా మనగురించి చెబుతూ మనుష్యులు అందరూ పాపము చేసారని చెప్పాడు. ఐతే ఇప్పుడు, దేవునికి మనుష్యునికి మధ్యలున్న సమస్య పాపము. అది దేవుని ఉగ్రతను మరియు నిత్యమరణాన్ని మనమీదకి తీసుకొని వస్తుంది. మనము ఆ సమస్యని పరిష్కరించుకోలేమని మరియు మనము చేసిన పాపములన్నిటికిని మనము తిరిగి ఏమియు చెళ్ళించలేమని దేవునికి కూడా తెలుసు. అయితే మనము దేవుని చేరుకోడానికి దేవుడే మనకొక మార్గాన్ని సిద్ధం చేసాడు. తన ప్రియ కుమారుడైన యేసును మన పాపాల ధర చెల్లించడానికై ఈ లోకానికి పంపాడు.

యేసు, మనము పాప క్షమాపణ మరియు అతని ద్వారా నిత్యజీవితాన్ని పొందుకోవాలని, సంతోషముగా మన పాపాలనిటిని తనపై తీసుకొని మన స్ధానంలో సిలువలో మరణించి మరియు మరణము నుండి తిరిగి లేచెను.

యేసు, దేవునితో విరిగిన మన సంబంధాన్ని పునరుద్ధరించగలిగే ఒకే ఒక్క మధ్యవర్తి. మనము చేయవలసిదేమిటంటే కేవలం యేసు యందు నమ్మకం ఉంచుట. అప్పుడు దేవుడు మనల్ని అంగీకరించి మరియు మనయందు ఆనందిస్తాడు.

ఇది నిజమైన శుభవార్త!

Share your love
Telugu